ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కృష్ణానది పరీవాహక ప్రదేశాల్లో, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతలు పథకాల ప్రాంతాల్లో, కోయిల్‌సాగర్, రామన్‌పాడ్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న వాగులను సర్వే చేపట్టిన చిన్ననీటిపారుదలశాఖ ఇంజినీర్లు మొత్తం 193 చెక్‌డ్యాంలు నిర్మించడానికి రూ.1318.26 లక్షలతో అంచనాలను రూపొందించారు.
తొలి విడతలో 92 చెక్‌డ్యాంల నిర్మాణాలు :
193 చెక్‌డ్యాంల నిర్మాణాల్లో తొలి విడతగా 92 నిర్మాణాలకు నీటిపారుదలశాఖ పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేసింది. వీటివల్ల ఎంత మంది రైతులకు ప్రయోజనం ఉండబోతుంది, భూగర్భజలాలు వృద్ధి చెంది ఉపయోగంలోకి వచ్చే ఆయకట్టు విస్తీర్ణం, చెక్‌డ్యాం నిర్మాణానికి అయ్యే ఖర్చు వంటివి పరిగణనలోకి తీసుకొని ఇంజినీర్లు అంచనాలు తయారు చేశారు. త్వరలో 30 చెక్‌డ్యాంల నిర్మాణం పనులకు ఉత్తర్వలు మంజూరు కాబోతున్నాయి. యుద్ధప్రాతిపదికన 10 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఈ నెలలో టెండర్లు నిర్వహించనున్నారు.
భూగర్భజలాల వృద్ధి కోసమే..
భూగర్భ జలాలు వృద్ధి చేయడం కోసమే నదులు, ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లోని వాగుల పొడవునా చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం ఆదేశించింది. కర్ణాటక రాష్ట్రంలో 1985 ప్రాంతంలోనే చెక్‌డ్యాంల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం వల్లే అక్కడ భూగర్భ జలాల సమస్య లేదు. వర్షాలకు నిండి అలుగుపారితే రైతులు, పర్యటకులు వచ్చి సందర్శించేలా మినీ ప్రాజెక్టుల తరహాలో వాటిని నిర్మిస్తామని సీనియర్ ఇంజినీర్ జైపాల్‌రావు తెలిపారు.
- ఇదీ చూడండి : రాజధానిలో భారీ వర్షం... తడిసి ముద్దయిన నగరం