ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా మలుపుతిప్పడంతో... కారు లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హైమద్, ఫైజల్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.
ఇదీ చూడండి: 'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు