దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన ప్రేమ్ కుమార్ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రాజకీయ ఘర్షణలతోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో స్థానికంగా భాజపా విజయం సాధించింది. ఆ సందర్భంగా భాజపాకు మద్దతుగా కొందరు యువకులు బాణాసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రేమ్ కుమార్‌కు ప్రత్యర్థి వర్గం నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి సమయంలో జీనుగురాల రోడ్డులో ప్రేమ్‌కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: యువకున్ని హత్యచేసి పెట్రోల్‌తో కాల్చేసి...