మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పెద్ద వడ్డెమాన్ గ్రామంలోని ఓ కుటుంబంలో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పది రోజులుగా వైరస్‌తో పోరాడుతూ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం దవాఖానాలోనే చనిపోయాడు. గురువారము కుటుంబ సభ్యులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అతనికి స్వగ్రామంలో అంతక్రియలు నిర్వహించారు.
దహనసంస్కారాల అనంతరం ఇంటికి చేరుకున్న కాసేపటికే మృతుడి అన్న సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడం వల్ల ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కాటుతో తమ్ముడు.. తమ్ముడి మృతి జీర్ణించుకోలేక అన్న మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: తమిళనాడులో మరో 5,835 మందికి కరోనా