భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. కరోనా వ్యాధి నివారణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణ కోసం విడుదల చేసిన రూ.7,192 కోట్ల నిధులకు సంబంధించిన లెక్కలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా అంశం ముగిసిన తర్వాత ఈటల రాజేందర్‌కు ఉద్వాసన తప్పదని జోస్యం చెప్పారు. తెరాస పార్టీని వెనకేసుకురావడం మంత్రికి తగదని హితవు పలికారు. రాష్ట్రంలో కొవిడ్-19 పరిక్షలు చేయడం లేదని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేని పక్షంలో... ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యులకు పీపీఈ కిట్లు అందించాలని కోరారు.