మహబూబ్నగర్ జిల్లా భూత్పురు మున్సిపాలిటీ కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. భాజపాకు చెందిన 5వ వార్డు సభ్యురాలు కృష్ణవేణి భర్త బాలస్వామితో కలిసి మంత్రి సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.