కనీస వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జీతం పెంచితేనే ఆన్లైన్ సర్వే చేపడతామని తేల్చి చెప్పారు. తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలు అడ్డు పెట్టి విధులు నిర్వహించామని ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించకుండా.. ఇంకా పని భారం పెంచుతోందని వాపోయారు. జీతాలు పెంచి, ఆన్లైన్ సర్వేకు అవసరమయ్యే కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వేధింపులను అడ్డుకోవాలంటూ ఆశాల వినతిపత్రం