మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. సుజాత, రామస్వామిల కుమార్తె హేతాన్సి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటి సంపులో పడిపోయింది. దాన్ని ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం గుర్తుండిపోవాలంతే!