ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 343కు చేరింది. తాజాగా 40 మంది కొవిడ్ బారిన పడగా... ముగ్గురు మృతి చెందారు. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 24కు చేరుకుంది. వనపర్తి జిల్లాలో అత్యధికంగా 24 కేసులు నమోదవగా... మహబూబ్‌నగర్‌లో 11, గద్వాలలో 4, నాగర్‌కర్నూల్‌లో 3, నారాయణపేటలో 2 కేసులు వెలుగుచూశాయి.
అధికంగా...
వనపర్తి జిల్లాలో ఇది వరకే ఓ ఏఎన్‌ఎం, ఆమె భర్తకు పాజిటివ్ రాగా.. వారి ప్రైమరీ కాంటాక్ట్ కింద 35 మంది నమూనాలు సేకరించారు. పరీక్షలు ఫలితాల్లో 11 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. అందులో ఆమె పని చేస్తున్న చోట ఉండే 9 మందికి పాజిటివ్ రాగా.. అందులో నలుగురు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు. వీరితో పాటు వనపర్తి పట్టణంలో నివసించే మరో 14 మందికి... కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా నిర్ధరణ అయింది.
మహబూబ్‌నగర్‌లో 11మందికి...
మహబూబ్‌నగర్ జిల్లాలో 11 మందికి వైరస్ నిర్ధరణ అయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అచ్చంపేట పట్టణంలో ఓ వైద్యుడితో పాటు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. లింగాల మండలం మగ్దూంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. నారాయణపేట పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు, మండల పరిధిలోని బోయిపల్లికి చెందిన వ్యక్తి కరోనా బారిన పడ్డారు.
మృతులు..
మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన వ్యక్తి ఇదివరకే కరోనా బారిన పడి హైదరాబాద్ గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. జడ్చర్లలో ఓ మహిళ మృతి చెందింది. కోయిల్‌కొండ మండలానికి చెందిన వ్యక్తి మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మృతిచెందాడు. ఆయన నమూనా పరీక్షలు రాగా... అందులో కరోనా నిర్ధరణ అయింది.
ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్