జూరాల ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద పోటెత్తింది. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాల ప్రభావంతో జూరాల జలాశయం నీటి సామర్థ్యం 3 లక్షల 21 వేల క్యూసెక్కులకు చేరింది. ఎగువనున్న ఆల్మట్టికి లక్షా 18 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... లక్షా 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటిమట్టం 123 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 112 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి 3 లక్షల 10 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... 3 లక్షా 17 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి 2 లక్షల 95 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... 33 గేట్ల ద్వారా 2 లక్షల 97 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్త్ ఉత్పత్తి ద్వారా 23 వేల క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా కోయిల్‌సాగర్ కూడి, ఎడమ సమాంతర కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల నుంచి మొత్తం 3 లక్షల 27 క్యూసెక్కుల ఓట్ ఫ్లో ఉంది.
ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం... ఏబీవీపీ నేతల అరెస్ట్