ETV Bharat / state

శ్రమజీవుల బతుకులను చిదిమేసిన రోడ్డు ప్రమాదం - రోడ్డు ప్రమాదం

పొట్టకూటి కోసం పొరుగూరు వెళ్లినవాళ్లపై విధి పగబట్టింది. పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికి తిరుగొస్తుండగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ పేద జీవులను కబళించింది. నుజ్జునుజ్జైన ఆటోలో శరీర భాగాలు తెగిపోయిన వారు కొందరైతే... ఏమి జరిగిందో తెలిసేలోపే ప్రాణాలు కోల్పోయినవారు ఇంకొందరు. ప్రమాదంలో విగతజీవులుగా మారిన ఆ కూలీలను చూసి మృత్యుదేవతే కన్నీళ్లు పెట్టుకునేలా ఉన్నాయి ప్రమాద దృశ్యాలు. మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలం కొత్తపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది కూలీలు ఘటనా స్థలిలోనే మరణించారు. మరో 6గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్రమజీవుల బతుకుని చిదిమేసిన రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 4, 2019, 9:31 PM IST

Updated : Aug 4, 2019, 9:49 PM IST

శ్రమజీవుల బతుకులను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

వాళ్లంతా ఒకే ఊరోళ్లు... తెల్లారి లేస్తే పిన్ని.. అక్క... చెల్లి అంటూ పలకరించుకుంటూ ఉండేవాళ్లు... ఊర్లో పనిలేదంటే పక్క ఊర్లో నాలుగు డబ్బులొస్తున్నాయని ఆటో కట్టించుకుని పనికెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. 18 మంది కిక్కిరిసి కూర్చున్నా వారి ఊసుల్లో ఇరుకనిపించలేదు. ఎప్పుడు ఇంటికి వెళ్తామా అన్న ఆలోచనే. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తున్నారు తొందరగా వెళ్లయ్యా అంటూ అడుగుతోంది ఓ చంటి బిడ్డ తల్లి. బడికెళ్లిన పిల్లలు వచ్చేస్తారని... ఇంట్లో పెద్ద వాళ్లకు వండి పెట్టాలి.. డ్రైవరన్నా తొందరగా వెళ్లు అంటున్నారు ఇంకొకళ్లు.. రేపు పనెక్కడో అంటూ ఊసులు చెప్పుకుంటూ వస్తున్నారు మిగతా వాళ్లు.

ఇంతలో ఊహించని ప్రమాదం వారి జీవితాలను బలిగొంది. ఎదురుగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి దగ్గర తమ వాళ్లను తలచుకుని ఎలాగైనా తమను బతికించండి అంటూ వాళ్లు చూసిన చూపులు చూపరులచే అశృధారలు కురుపించింది. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.

సూర్యాస్తమయం వేళలో వారి జీవితాలు తెల్లారిపోయాయి. శరీర భాగాలు తెగిపోయి బతికించండి అని వేడుకున్న వాళ్లు కొందరైతే... చలనం లేకుండా నిర్జీవులుగా పడిఉన్న వాళ్లు మరికొందరు. నుజ్జునుజ్జైన ఆటోలో ఇరుక్కుపోయి మృతదేహాలు ఛిద్రంగా మారాయి. మృత్యు దేవతకే కన్నీళ్లు పెట్టించేలా ఉన్న ఈ ఘటన ప్రమాద స్థలిలో ఉన్నవారిని భయకంపితులను చేసింది.

అతివేగం, రోడ్డు సరిగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. గతంలో కూడా ఈ ప్రదేశంలో అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Aug 4, 2019, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.