తమ్ముడు చనిపోయిన కాసేపటికి అన్నయ్య మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. వీరిద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి దగ్గరి బంధువులు. గ్రామానికి చెందిన కడియం నారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం తెల్లవారుజామున మృతి చెందారు. తమ్ముని మృతితో కలత చెందిన అన్న రామలింగయ్య మధ్యాహ్నం సమయంలో మృతి చెందారు. గ్రామంలో ఒకేరోజు ఇద్దరు మృతి చెందటం వల్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.
ఇదీ చూడండి: కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే