తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని... నలుగురు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని వెంకటేశ్వర బజారులో ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని కొంతమంది నివసిస్తున్నారు. ఆ స్థలంలో దారం మమత అనే మహిళ ఇంటిని నిర్మించుకుంటోంది. ఆ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ రంజిత్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. పోలీసులు వెళ్లి దారం మమతను విచారించగా... ఆధారాలు చూపించకపోవడంతో నిర్మాణాన్ని కూల్చివేశారు.
ఇవీచూడండి: 2019 రౌండప్: పాట హిట్.. సినిమా మాత్రం?