మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని 1, 14వ వార్డుల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తెరాసకే ఓటు వేయాలని కోరారు.
ఏ కష్టం వచ్చినా... కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటిలో సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఓటు అడిగే హక్కు తమకే ఉందని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి : 'జనాభా లెక్కల్లో బీసీల జనగణన జరపాలి'