రాబోయే జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీ జనగణన చేపట్టి... లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి కేంద్ర ప్రభుత్వానికి బీసీ జనగణన జరిగేలా సూచించాలని విజ్ఞప్తి చేశారు.
గత సంవత్సరం ఇదే అంశంపై దిల్లీలో ప్రధాని మోదీని కలిసినట్టు ఆయన తెలిపారు. ప్రధాని తమ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించారని... అయినప్పటికీ జనాభా గణన చేపట్టలేదన్నారు. బీసీ జనాభా లెక్కలు చేయకపోవడం వల్ల అనేక రకాల అవరోధాలు ఎదురవుతున్నాయన్నారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల చట్టసభల్లో బీసీలకు తగు ప్రాధాన్యం కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..