ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్​

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 328 ద్విచక్ర వాహనాలు సీజ్​ చేసి... రూ.30,200 జరిమానా విధించారు.

vehicles seized in mahabubabad
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్​
author img

By

Published : Apr 17, 2020, 6:26 AM IST

కరోనా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరి తీరు మారడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపైకి రావొచ్చనే వెసులుబాటును ఆసరాగా చేసుకుని అవసరం లేకపోయినా తిరుగుతున్నారు కొందరు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై మహబూబాబాద్​లో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 328 ద్విచక్ర వాహనాలు సీజ్​ చేశారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో మహబూబాబాద్ పట్టణంలో స్పెషల్​ డ్రైవ్​ చేపట్టగా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారు చాలా మంది కనిపించారని పోలీసులు తెలిపారు. 328 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని... రూ.30,200 జరిమానా విధించినట్లు వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రానున్న రోజుల్లో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు చేస్తామని... ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.