మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంద్ నిర్వహిస్తున్న 150 మంది అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, కుల సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో టీఎన్జీవోలు సంఘీభావం తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీస్ ఎస్కార్ట్ నడుమ బస్సులను నడిపించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ముగిసిన ఆర్టీసీ బంద్ - TSRTC Strike in Mahabubabad district
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల బంద్ సందర్భంగా 150మంది అఖిలపక్ష పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.