మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా స్థాపించిన తెరాస.. నేడు రాష్ట్రంలో తిరుగు లేని పార్టీగా విస్తరించిందని శంకర్‌నాయక్ అన్నారు. ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఇవీ చూడండి: స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్