మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్, ధాన్యం కొనుగోలుపై పాలనాధికారి గౌతమ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ హాజరయ్యారు. కరోనా నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నందువల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించారని చెప్పారు. గ్రామాల్లో పెరుగుతున్న కేసులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందుకు గ్రామస్థాయి కమిటీలను నియమిస్తామన్నారు.
ఎంపీడీవోలు, తహసీల్దార్లు పర్యవేక్షించి నివేదికలను ఇస్తారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 64 వేల 173 పరీక్షలు నిర్వహించగా.. 6,826 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌కు అదనపు బ్లాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హరిప్రియ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ వార్డులో రోగులతో కలిసి నర్సుల డాన్సులు