ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సివిల్ జడ్జి సరిత అన్నారు. తొర్రూర్ మున్సిపాలిటీలో మండల న్యాయ సేవా సంస్థ, తొర్రూర్ బార్ అసోసియేషన్ సంయుక్తంగా 87 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో తొర్రూర్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. దేశంలోనే లాక్డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పగడ్బందీగా అమలు చేస్తున్నారని... ప్రజలెవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకురావొద్దని సూచించారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక