మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత బజార్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో ఇద్దరు స్థానిక మహిళలు కాగా... ఇద్దరు యువతులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెక్స్ రాకెట్ పై పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'