ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షాలు... ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ప్రవహించే మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి తదితర వాగులు ఉద్ధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1560 చెరువులకు గాను... 1546 చెరువులు అలుగు పోస్తున్నాయి. 14 చెరువులు 75 శాతానికి పైగా నిండి మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఎడతెరిపి లేని వర్షాలు... ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
ఎడతెరిపి లేని వర్షాలు... ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
author img

By

Published : Aug 18, 2020, 2:05 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో 5 రోజుల పాటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకల్లో జలకళ సంతరించుకుంది. వాగులు, చెరువుల్లో అలుగు ఉద్ధృతంగానే పోస్తున్నప్పటికీ 2 చోట్ల మినహా జిల్లా వ్యాప్తంగా రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఉద్ధృతంగానే ప్రవాహం...

జిల్లాలో ప్రవహించే మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి తదితర వాగులు ఉద్ధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 1560 చెరువులకు గాను... 1546 చెరువులు అలుగులు పోస్తున్నాయి. 14 చెరువులు 75 శాతానికి పైగా నిండాయి.

భారీవర్షాలు, నీటి ఉధృతితో గుడూరు మండల కేంద్రంతో కేసముద్రం, నెక్కొండ, గార్ల నుంచి రాంపురం, మద్దివంచల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు చోట్ల వాగుల ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని దాటకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో జిల్లాలో వరద ప్రవాహం, పంట నష్టాన్ని కలెక్టర్ గౌతమ్ అంచనా వేశారు. వర్షాలకు జిల్లాలోని 16 మండలాల పరిధిలో 5862 మంది రైతులకు చెందిన 9690 ఎకరాల్లో వరి పంట, 370 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్ వెల్లడించారు.

ఇవీ చూడండి : ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.