ఆటో డ్రైవర్లు అంతా విధిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించి ప్రమాదాల నివారణ దిశగా కృషి చేయాలని పోలీసులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటో డ్రైవర్ వృత్తి ప్రజలకు సేవ చేసేదని, ఈ వృత్తిలో నిజాయతీగా ఉండాలని, ప్రతి ఒక్క డ్రైవర్ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చాలని ఎస్పీ తెలిపారు. జిల్లా ఏర్పాటు తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిందని అలాగే ట్రాఫిక్ నియమాలను అందరూ కచ్చితంగా పాటించాలని, రూల్స్ అధిగమించిన వారికి జరిమానా విధించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మహేశ్, డీఎస్పీ నరేష్ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 600 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉన్నావ్ ఘటన నిందితుడు సెన్గర్పై హత్య కేసు