ETV Bharat / state

'పుస్తకాల్లో తెలంగాణ చరిత్రను మార్చితే ఊరుకోం'

తెలంగాణ చరిత్రను వక్రీకరించవద్దని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

'తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి'
author img

By

Published : Sep 15, 2019, 11:12 AM IST

తెలంగాణ చరిత్రను వక్రీకరించ వద్దని, చరిత్రను చరిత్రగా రాయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సీపీఐ చేపట్టిన వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంది. సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చరిత్రను కేసీఆర్, నరేంద్ర మోదీలు హైజాక్ చేస్తున్నారని సాంబశివరావు విమర్శించారు. భాజపా పటేల్​ను, కేసీఆర్ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను మా వారే అంటున్నారనీ.. వారిపై అంత ప్రేముంటే జిల్లాకొక నాయకుని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. తెలంగాణను సాధించింది కమ్యూనిస్టు పార్టీయేనని చరిత్రను గుర్తు చేశారు. ఈ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.