మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు దేశ్యాతండా వద్ద ఎస్సారెస్పీ ఉప కాలువకు గండిపడింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ నాశనమయ్యాయి. గతంలో దేశ్యాతండా శివారులోని డీబీఎం-60 ప్రధాన కాలువ నుంచి రైతుల సాగు భూములకు జలాలు తరలించేందుకు ఉపకాలువను తవ్వారు. కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఉప కాలువకు ఇరువైపులా ఉన్న కట్టభూమి ఆక్రమణకు గురై...నీరు ప్రవహించి కుంగిన ప్రదేశంలో గండిపడింది. గోదావరి జలాలు మొత్తం రైతుల పంట చేల మీదుగా ప్రవహించాయి. సుమారు పదెకరాల్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలు పాడైపోయినట్లు రైతులు తెలిపారు.
ఇవీ చూడండి: మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి