మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో తెరాస కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడారు. "మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కొన్ని కారణాలతో ప్రొఫెసర్ సీతారాంనాయక్కు టికెట్ ఇవ్వలేక పోయామని, అతను ఏ తప్పు చేయలేదని" ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ప్రస్తుత అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు.
వెనుకబడిన గిరిజన జిల్లా మహబూబాబాద్‌కు కోరిన వరాలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని సత్యవతి రాఠోడ్ తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: దేశం దశ.. దిశ మారుద్దాం: కేసీఆర్