ETV Bharat / state

Check dam shutters destroy : చెక్​ డ్యాం షట్లర్​లు​ ధ్వంసం చేశారు.. ఎందుకంటే..? - Who destroyed the shutters in narasimhula peta

Check dam shutters destroy in Mahbubabad : మహబూబాబాద్ జిల్లాలో చెక్​ డ్యాంకి ఉన్న షట్లర్లలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో డ్యాంలో ఉన్న సాగు నీరంతా వృథాాగా పోతుంది. స్థానిక రైతులందరూ పండించేందుకు నీరు ఉండదేమోనని ఆందోళన చెందుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 12, 2023, 7:51 PM IST

Check dam shutters destroy in Mahbubabad : భూగర్భ జలాలతో చెరువు అంతా నిండి ఉంది. వచ్చే సీజన్​లో పంట బాగా పండించుకోవచ్చని అనుకున్న రైతులకు బాధే మిగిలింది. ఆ చెక్ డ్యాంపై ఇసుక మాఫియా చేస్తున్న దుండగల కన్ను పడింది. సీన్​ కట్​ చేస్తే వాటి​కి ఉండే షట్లర్లను ధ్వంసం చేశారు. సాగు కోసం పనికి వస్తాయనుకున్న నీరు అంతా వృథాగా పోతోంది. అది చూసిన అన్నదాతకు గుండెల్లో గుబులు మొదలైంది. అధికారులు ఈ విషయం తెలిసిన ఏమి పట్టనట్టు ఉండడంతో కర్షకులను కలవర పెడుతోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.

స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమంగా ఇసుక తరలించేందుకు అడ్డుకట్ట వేసే వారే లేక అదుపు లేకుండా పోతోంది. ఇసుక కోసం అక్రమార్కులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. వారు అంతటితో ఆగకుండా.. తమకు ఎదురులేదనే ధైర్యంతో ఏమి చేయడానికైనా వెనకాడట్లేదు. ఈ క్రమంలోనే నరసింహులపేట మండలం ముంగిమడుగు శివారులో వరద నీటి వృథాను అరికట్టేందుకు.. ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం గతంలో ఆకేరు వాగుపై చెక్ డ్యాంను నిర్మించింది. దీనిలో నిల్వ ఉన్న నీటితో భూగర్భ జలాలు పెరిగాయి. ఆయకట్టు రైతులు విద్యుత్ మోటార్ల ద్వారా సాగు నీటిని వినియోగించుకుని పంటలు సాగు చేసుకుంటున్నాం.

ఇసుక తీసుకెళ్లేందుకే: ఈ క్రమంలోనే చెక్ డ్యాం నీటితో నిండు కుండలా మారింది. ఇసుక దందా దళారుల కన్ను ఇందులో అడుగున ఉన్న ఇసుకపై పడింది. దీoతో గుర్తుతెలియని వ్యక్తులు చెక్ డ్యాంకు ఏర్పాటు చేసిన రెండు షట్టర్లను గడ్డపారలతో ధ్వంసం చేశారు. షట్టర్లు ధ్వంసం కావడంతో నిల్వ ఉన్న సాగునీరoతా వృథాగా దిగువకు వెళ్లిపోతుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యామ్​లో నీటిని ఖాళీ చేసిన అనంతరం ఇసుక తీసుకెళ్లే ఉద్దేశంతోనే షట్టర్లను ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. సాగు నీరంతా వృథాగా పోతున్న.. సంబంధిత అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేనందున జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చెక్​ డ్యాం షట్లర్​లను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.