మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గవర్రాజు దంపతులను సన్మానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని అన్నారు.
తెలంగాణలో 915 సంక్షేమ వసతి గృహాల్లో 2.50 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన వారు ప్రజలను చైతన్యపరిచే విధంగా తమ తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్యతోపాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం