ETV Bharat / state

నిర్లక్ష్యం ఖరీదు... రెండు ప్రాణాలు, ముగ్గురి జీవితాలు! - ఒక నిర్లక్ష్యం ఖరీదు 2 ప్రాణాలు... ముగ్గురు పిల్లల జీవితాలు

పండుగను సొంతూరులో జరుపుకుందామని బయల్దేరిన వాళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు అత్తమ్మమామకు సరదా కబుర్లు చెప్పిన చిన్నారి ఇప్పుడు అచేతనంగా ఆస్పత్రి మంచం మీదుంది. నిండా 20 ఏళ్లు కూడా లేని యువకులు అతివేగంతో చేసిన తప్పిదం... రెండు బీద కుటుంబాలను జీవితంలో తేరుకోలేని దెబ్బకొట్టాయి.

RAJENDRANAGAR CAR AND BIKE ACCIDENT FULL STORY
author img

By

Published : Oct 8, 2019, 11:44 PM IST

ఒక నిర్లక్ష్యం ఖరీదు 2 ప్రాణాలు... ముగ్గురు పిల్లల జీవితాలు
అతివేగం, నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మారారు. ఓ పాలబుగ్గల పసిపాప ఆస్పత్రి మంచం మీద అచేతనంగా పడిఉంది. మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన చెన్నయ్య దంపతులు నార్సింగిలో నివాసముంటున్నారు. సొంతూరిలో పండుగ జరుపుకుందామని తన బావమరిది కూతురు మౌనికను తీసుకుని ద్విచక్రవాహనంపై ముగ్గురూ బయల్దేరారు.

మెరుపు వేగంతో వచ్చి...

నార్సింగి నుంచి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ... హిమాయత్​సాగర్ సర్వీసు రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఇంతలోనే కారు రూపంలో మెరుపువేగంతో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. అతివేగంగా వచ్చిన మారుతీ బ్రెజ్జా... ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ముగ్గురు గాల్లోకి ఎగిరి పడ్డారు. చెన్నయ్య, పద్మమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మౌనిక మాత్రం పక్కనే ఉన్న ముళ్ళపొదల్లో పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారులో ఉన్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

అనాథలుగా మారిన పిల్లలు... అచేతనావస్థలో మౌనిక...

ప్రమాదం వల్ల రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన దంపతులకు ఇద్దరు పిల్లలుండగా... వారిప్పుడు అనాథలుగా మిగలిపోయారు. సరదా మాటలతో ముద్దులొలికే చిన్నారి మౌనిక ఇప్పుడు... కాలు, చేయి విరిగి, తలకు తీవ్రగాయంతో అచేతనంగా మారింది. వైద్యం అందిస్తున్నా... తగిలిన గాయాలు మానటానికి చాలాకాలం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కూలీనాలీ చేసుకుని పూటగడుపుకునే ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురి పరిస్థితి చూసి లబోదిబోమంటున్నారు.

మితిమీరిన వేగమే కారణం...

హైదరాబాద్​ పాతబస్తీకి చెందిన అజీజ్​తోపాటు అతని నలుగురు స్నేహితులు కారులో సర్వీసు రోడ్డుపై మితిమీరిన వేగంతో ప్రయాణించటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటనలో అదుపుతప్పిన కారు... డివైడర్​ని ఢీకొని పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయింది. కారులోని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు ప్రధాన నిందితుడు అజీజ్​ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి...

రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాలు ఈ ప్రమాదంతో తేరుకోలేని దీనావస్థలో పడ్డాయి. అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వం ఆదుకొని... గాయపడ్డ చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి : వెనక్కి తగ్గమంటున్న ప్రభుత్వం, కార్మిక సంఘాలు...

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.