మహబూబాబాద్‌లో రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవటం వల్ల పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు ప్రవహించాయి. వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణం చేశారు. ఈ సీజన్లో ఇంతటి భారీ వర్షం ఇప్పటివరకు పడలేదని, రహదారులపై నీళ్లు కూడా ఈ విధంగా ఎప్పుడూ ప్రవహించ లేదని స్థానికలు వెల్లడించారు.
ఇవీచూడండి: జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం