మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురిసింది. డోర్నకల్, మరిపెడ, కురవి, నర్సింహులపేట, చిన్నగూడూరు, దంతాలపల్లి మండలాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. చిరు జల్లులతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముసురుతో గ్రామాల్లో వీధులన్నీ బురదమయంగా మారాయి. భారీ వర్షాలు కురుస్తే వాగులు, వంకలు సాగి చెరువులు, కుంటలకు నీరొచ్చే అవకాశం ఉందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు