ETV Bharat / state

Ragging At Mahabubabad Medical College : మళ్లీ ర్యాగింగ్‌ కలకలం.. మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీలో ఏడుగురు విద్యార్థులు సస్పెండ్

Ragging At Mahabubabad Medical College : ఓవైపు కళాశాల యాజమాన్యాలు.. మరోవైపు అధికారులు.. ఎన్నిచర్యలు తీసుకున్నా ఇప్పటికీ చాలా కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైద్యకళాశాలల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇటీవలే కేయూలో ర్యాగింగ్ చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసిన ఘటన మరవమకముందే.. ఇప్పుడు మహబూబాబాద్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది.

Ragging Issues in Mahabubabad Medical College
Ragging in Mahabubabad Government Medical College
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 2:02 PM IST

Updated : Oct 3, 2023, 2:54 PM IST

Ragging At Mahabubabad Medical College మళ్లీ ర్యాగింగ్‌ కలకలం.. మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీలో ఏడుగురు విద్యార్థులు సస్పెండ్

Ragging At Mahabubabad Medical College : ఈ మధ్యకాలంలో కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయి. సీనియర్లు అనే అహంకారంతో.. కొత్తగా వచ్చిన విద్యార్థులను కొంతమంది సీనియర్ విద్యార్థులు నానారకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. కొందరు వాటిని సహిస్తూ సర్దుకుపోతే.. మరి కొందరు కాలేజీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులను వదిలి ఉన్నత చదువులు చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు సీనియర్‌ స్టూడెంట్స్‌ ర్యాగింగ్‌ పేరిట నానా హింసలు పడుతున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలల్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది.

Mahabubabad Medical College Ragging : ఈ మధ్య వైద్యకళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జూనియర్లపై సీనియర్లు హుకుం చలాయిస్తూ.. పరిధికి మించిన ర్యాగింగ్ చేయడంతో జూనియర్లు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది విద్యార్థులు ఆ వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటీవలే కేయూలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపిన సంగతి మరవకముందే.. ఇప్పుడు మహబూబాబాద్​లో మరో ఘటన చోటుచేసుకుంది.

Prathidwani Debate on Ragging Issue in Colleges : విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం కట్టడి ఎలా?

Medical Students Suspended For Ragging in Mahabubabad : తాజాగా ర్యాగింగ్ చేసిన ఏడుగురు విద్యార్థులను హాస్టల్‌ నుంచి బహిష్కరించిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఈ నెల 21వ తేదీన ఏడుగురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లి సర్‌ అని సంబోధించాలని ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో వారితో కాస్త అసభ్యకరంగా.. ప్రవర్తించినట్లు తెలిసింది.

7 Students Suspended in Kakatiya Medical College : ర్యాగింగ్​ చేసినందుకు.. ఏడుగురు వైద్య విద్యార్థుల సస్పెండ్​

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరులు యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ జరిపించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మొదట తల్లిదండ్రుల సమక్షంలో ఏడుగురు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొదటిగా తప్పుగా భావించి ఆ ఏడుగురు విద్యార్థులకు హాస్టల్‌ వసతిని రద్దు చేసినట్లు తెలిపారు. వారికి కళాశాలలో ఎలాంటి బాధ్యతలను ఇవ్వమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సీనియర్లెవరైనా ఇలా ర్యాగింగ్​కు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని జూనియర్లకు సూచించారు ప్రిన్సిపల్.

"మహబూబాబాద్‌ మెడికల్ కాలేజీలో సెప్టెంబరు 21వ తేదిన ఏడుగురు సీనియర్ విద్యార్థులు జూనియర్స్‌ క్లాస్‌కు వెళ్లి 15 నిమిషాలు వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ వీడియో యాంటి ర్యాగింగ్ కమిటీకి చేరింది. ఆ వీడియోపై వారు సమగ్ర విచారణ జరిపి దానిపై నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఆ ఏడుగురు విద్యార్థులను డే స్కాలర్‌గా రమ్మని చెప్పాం. వాళ్లు స్టూడెంట్ లీడర్‌గా ఉండడానికి అర్హులు కారు. వారి హాస్టల్ వసతి కూడా రద్దు చేశాం. ఇది మొదటి తప్పుగా భావించి వదిలేశాం. కానీ ఈ తప్పు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని చెప్పాం. ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం." - వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్, మహబూబాబాద్ వైద్యకళాశాల

'రక్షిత ఆత్మహత్య చేసుకోడానికి ర్యాగింగ్​ కారణం కాదు'

కాలేజీలో ర్యాగింగ్.. జూనియర్లను నిల్చోబెట్టి.. సీనియర్లు వరుసగా..

Last Updated : Oct 3, 2023, 2:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.