ETV Bharat / state

పౌష్టికాహారం అందించేందుకే పోషణ్​ అభియాన్​: శివలింగయ్య - మహబూబాబాద్​ జిల్లా

చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్​ పథకాన్ని ప్రవేశపెట్టిందని మహబూబాబాద్ జిల్లా పాలనాధికారి శివలింగయ్య అన్నారు.

పౌష్టికాహారం అందించేందుకే పోషణ్​ అభియాన్​: శివలింగయ్య
author img

By

Published : Sep 28, 2019, 9:12 AM IST

మాతా శిశు మరణాల రేటును తగ్గించి, చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్​ పథకాన్ని ప్రవేశపెట్టిందని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ శివలింగయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్​లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అంగన్​వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లను పరిశీలించి, వాటిని రుచి చూశారు. పోషకాహార లోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని, దీనిపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి, పిల్లల ఎదుగుదలకు అంగన్​వాడీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్​వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారం అందించేందుకే పోషణ్​ అభియాన్​: శివలింగయ్య

ఇదీ చూడండి:సీఎం కాన్వాయ్​ని బైక్​తో ఢీకొట్టిన యువకుడు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.