ETV Bharat / state

ఉప్పొంగుతున్న వాగులు.. వరదనీటితో చెక్​డ్యామ్​ల పరవళ్లు

రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున వరద నీరు చేరి చెక్​డ్యామ్​లు పరవళ్లు తొక్కుతున్నాయి.

ponds-flooded-with-rain-water-in-dornakal-due-to-heavy-rain-in-mahabubabad-district
డోర్నకల్​లో ఉప్పొంగుతున్న వాగులు
author img

By

Published : Sep 15, 2020, 12:00 PM IST

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వాగులు నిండుకుండలా మారాయి. చిన్నగూడూరు మండలంలోని ఆకేరు, దంతాలపల్లి మండలంలోని పాలేరు, డోర్నకల్​లోని మున్నేరు వాగులకు వరద నీరు పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటం వల్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించి అలుగు పారుతున్నాయి.

వాగులపై నిర్మించిన చెక్ డ్యాంలు నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.