మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 2 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి ఆభరణాలు, 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జగ్గుతండాకు చెందిన బాదావత్ విజయ్ కుమార్, అతని ప్రేమికురాలితో కలిసి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ రమేశ్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డులందించారు. బాలిక మైనర్ అని గుర్తించినట్లు తెలిపారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ