ETV Bharat / state

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు- బెల్లం ఊట, పటిక స్వాధీనం - ఆబ్కారి సీఐ లావణ్యసంధ్య

పోలీసులు, ఆబ్కారిశాఖ అధికారులు కలిసి గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఈ తనిఖీల్లో భారీగా బెల్లం ఊట, గుడుంబాను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు.

Police and Excise Prohibition officers raid on Gudumba bases.. seized jaggery juice and alum
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు- బెల్లం ఊట, పటిక స్వాధీనం
author img

By

Published : Nov 6, 2020, 4:59 PM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం వీరారం శివారు దుబ్బతండాలో పోలీసులు, అబ్కారిశాఖ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 250 లీటర్ల బెల్లం ఊట, 15 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 60 కిలోల నల్లబెల్లం, 15 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.

గుడంబా తయారీకి పాల్పడుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆబ్కారి సీఐ లావణ్యసంధ్య, ఎస్సై అశోక్‌ తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చదవండి: 'గంగుల శ్రీనివాస్​ మృతికి ప్రభుత్వ వైఖరే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.