మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు బాలుర హృదయ విదారక గాథ ఇది. ఇటికాల సంధ్య, వెంకన్న దంపతులు కూలి పనులు చేసి జీవిస్తుంటారు. వీరి పెద్ద కుమారుడు చరణ్(11) ఆరేళ్ల వరకు అందరిలా పాఠశాలకు వెళ్లి బాగా చదువుకుంటుండేవాడు. ఏడేళ్ల వయస్సులో ఉన్నట్లుండి కంటిచూపు కోల్పోయాడు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన వీరు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు..అక్కడి వైద్యులు దీన్ని ‘లెబర్స్ కాన్‌జెనిటల్ అమారోసిస్’గా తేల్చి పిల్లవాడికి 100 శాతం అంధత్వం వచ్చిందని చెప్పారు. చూస్తుండగానే చరణ్ నడవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చి ఇంట్లోనే అచేతనంగా ఉంటున్నాడు. కొడుకు దీనావస్థను చూసి కుమిలిపోతున్న పేద దంపతులపై మరోసారి పిడుగు పడింది.
చిన్న కుమారుడు శరత్ (9) సైతం ఏడేళ్ల వయస్సు వచ్చేటప్పటికి అన్న చరణ్‌లా అయిపోయాడు. మేనరికం ప్రభావంతో ఇలాంటి అరుదైన వ్యాధులు వస్తుంటాయని వైద్యులు అభిప్రాయపడినట్లు వారు చెప్పారు. సెంటు భూమి కూడా లేని వీరు ఇప్పటికే ఇద్దరి వైద్యం కోసం అప్పులు చేసి చితికిపోయారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛను అయినా తన కుమారులకు ఇవ్వాలని తండ్రి వెంకన్న అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఒక్క అధికారి కూడా స్పందించలేదు (Parents seeking donor for the treatment of children). ఇప్పటికైనా ప్రభుత్వం, దాతలు స్పందించి తమ కుమారులను ఆదుకోవాలని పేద దంపతులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: please save my child: 'మీరు చేసే సాయంతోనే నా బిడ్డ నాకు దక్కుతాడు'