ETV Bharat / state

School gate locked: ప్రధానోపాధ్యాయురాలు నిర్వాకం.. పాఠశాల గేటుకు తాళం - పాఠశాల గేటుకు తాళం

School gate locked: సమయపాలన పాటించడం లేదంటూ ప్రధానోపాధ్యాయురాలిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

School gate locked
పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన
author img

By

Published : Dec 22, 2021, 4:47 PM IST

School gate locked: ప్రధానోపాధ్యాయురాలు ఆలస్యంగా రావడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పించింది. సమయ పాలన పాటించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

headmaster late in mahabubabad: జిల్లా కేంద్రంలోని వెంకటెశ్వరబోడ్​లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పొన్నమ్మ ప్రతి రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సరైన సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

govt school headmaster: పాఠశాలకు సంబంధించిన బడ్జెట్ విషయంలో ఛైర్మన్​తో సంబంధం లేకుండా నిధులు డ్రా చేసుకుంటూ తన ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పాఠశాలకు తాళం వేశామని తెలిపారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులంతా ఆరుబయటే ఉండిపోయారు. మిగతా ఉపాధ్యాయులు మరోసారి ఈ విధంగా జరగకుండా చూస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో వారు గేటు తాళం తీశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పాఠశాలలో 120 మంది విద్యార్థులుకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.