ETV Bharat / state

విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధం - విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధం

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేటలో విద్యుదాఘాతంతో వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

Paddy Grass fire Due to Electrical Shock in Mahabubabad district
విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధం
author img

By

Published : May 18, 2020, 11:19 AM IST

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేటలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. దీనివల్ల మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించటం వల్ల 1500 మోపులు గల గడ్డి పూర్తిగా కాలిపోయినట్లు రైతులు వాపోయారు. ఈ ప్రమాదంలో రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక యంత్రాలు ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లిందని గ్రామస్థులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.