ETV Bharat / state

చెరువులో మునిగి మృతిచెందిన ఎంపీటీసీ - DEAD NEWS

చెరువులో దిగిన పశువులను బయటకు రప్పించేందుకు నీటిలో దిగిన ఆ వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. ఈ విషాదం మహబూబాబాద్​ జిల్లా చిన్నగూడూరు మండలం తుమ్మల చెరువు తండాలో జరిగింది. మృతుడు విస్సంపల్లి ఎంపీటీసీగా గుర్తించారు.

MPTC DIED DUE TO DROWN IN POND
చెరువులో మునిగి మృతిచెందిన ఎంపీటీసీ
author img

By

Published : Apr 16, 2020, 12:18 PM IST

మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం విస్సంపల్లి శివారు తుమ్మలచెరువు తండాలో విషాదం చోటు చేసుకుంది. విస్సంపల్లి ఎంపీటీసీ బానోత్‌ వెంగళ్‌రావు(29) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించాడు. చెరువులోకి దిగిన పశువులను బయటకు రప్పించేందుకు వెంగళ్‌రావు అందులోకి దిగాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా... లాభం లేక నీట మునిగి మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. విషయం తెలిసి ఘటనా స్థితికి చేరుకున్న కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వెంగళ్​రావుకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంపీటీసీ సభ్యుడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.