మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 46వ రోజు కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్న పాలకులు... నేడు కార్మికుల సమస్యలపై సీతకన్ను వేశారని ఆయన ఆరోపించారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 32 జడ్పీ ఛైర్మన్లు ఉన్నా, నాలుగేళ్ల తర్వాత మనుగడ ప్రశ్నార్థకమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కేసీఆర్ తీరుతో ఆర్టీసీ మరింత నష్టపోతోంది: భట్టి