ప్రజలలో తెదేపాపై అభిమానం చెక్కు చెదర్లేదని, క్యాడర్ కూడా బలంగానే ఉందని వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పాడుపెళ్లి సురేశ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెెళ్లి.. వారిని చైతన్యం చేయాలని, పట్టభధ్రులందరిని ఓటర్లుగా నమోదు చేయాలని కార్యకర్తలను కోరారు. నిరుద్యోగులు గతంలో కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయారని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్లమెంట్ ఇంఛార్జ్ కొండపల్లి రామచందర్ రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెరాస కార్పొరేటర్లలో ఆ 15 శాతం మంది ఎవరో అనే గుబులు!