పొడు భూముల్లో ట్రెంచ్‌లు కొడితే తనకు సమాచారం అందించాలని, ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటానని... ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ, పోనుగోడు, భూపతి పేట గ్రామాల్లో రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. లైన్ తండాలో జరిగిన పోడు భూముల ఘర్షణపై అటవీశాఖ అధికారులపై నిప్పులు చెరిగారు. రైతుల సంక్షేమం కోసమే తెరాస ప్రభుత్వం ఉందని అన్నారు. వారి జోలికి ఎవరు పోయినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
'ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. యథాతథ స్థితిని మెయింటెయిన్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దయచేసి అటవీశాఖ అధికారులు రైతులను రెచ్చగొట్టవద్దు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే హరితహారం పేరుతో కోట్ల మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం.' ----- ఎమ్మెల్యే శంకర్ నాయక్ |
ఇదీ చదవండి: ఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం