మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారంలో రూ.12.50 లక్షల నిధులతో చేపట్టిన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ప్రజా ప్రతినిధులు.. అధికారులు కలిసి...
శ్మశాన వాటికలతో పాటు డంపింగ్ యార్డులు, హరితహారం నర్సరీలను ఏర్పాటు చేసిందన్నారు. అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఈ నెల 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.