ETV Bharat / state

ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​

మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రాన్ని శాసనసభ్యులు రెడ్యానాయక్​ ప్రారంభించారు. రైతుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.

mla redya nayak inaugurated agro farmers service centre in mahabubabad district
ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 12, 2020, 5:28 PM IST

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్నిఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దుకాణంలో పత్తి గింజలు కొనుగోలు చేశారు.

రైతుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు నియంత్రిత పంటల సాగు విధానాన్ని అవలంభించి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నవీన్ రావుతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలు నాటండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.