మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. స్థానిక కూరగాయల మార్కెట్, కాలనీల్లో రసాయన ద్రావణం పిచికారీ చేయించారు. పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపడమే ప్రభుత్వం ధ్యేయమని ఆయన తెలిపారు. రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: ఎవరి బలాబలాలు ఏందో మైదానంలో తేల్చుకుందాం: రేవంత్