కేయూ విద్యార్థి సునీల్ నాయక్ మృతిపట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ సంతాపం తెలిపారు. సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. సునీల్ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చారు. మృతుని తల్లిదండ్రులకు రెండు పడక గదుల ఇల్లు... దహన సంస్కారాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
గత నెల 26న హన్మకొండలో సునీల్ ఆత్మహత్యాయత్నం చేయగా... హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందాడు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయట్లేదని సునీల్ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెలిబుచ్చాడు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: కోదండరామ్