మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుత కరోనా పరిస్థితులు... వైరస్ కట్టడిపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ వి.పి గౌతమ్‌తో కలిసి సమావేశమయ్యారు.
వైరస్ ప్రభలకుండా ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోవాలి... ఎలాంటి నిబంధనలు విధించాలనే అంశంపై చర్చించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు... అవలంభించాల్సిన పారిశుద్ధ్య ప్రణాళిక, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త