కరోనా పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంగారిగూడెంలో బండి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ భౌతికదూరం పాటించాలన్నారు. కష్ట కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు, వలస కార్మికులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావడం హర్షణీయమని మంత్రి ప్రశంసించారు.