మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మర్రిమిట్ట మృతుల కుటుంబ సభ్యులను మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు పరామర్శించారు. ఒక్కో మృతుడికి రూ.10వేల చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి ఆర్థిక సాయం అందజేశారు. ఎంపీ కవిత రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
దురదృష్టకరం
పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైవే పనులను చాలాసార్లు పరిశీలించానని... పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించినా అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్ట పగలే డ్రైవర్ మద్యం సేవించి ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రి అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారిపై మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
త్వరగా కోలుకోవాలి...
వీరందరికీ భూముల ఉన్నా అటవీ భూములు కావడంతో పట్టాలు లేవని అన్నారు. డ్రైవర్ రాముకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమి ఉందని... అతనికి రూ.ఐదు లక్షల బీమా వచ్చేందుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని అన్నారు. మంత్రి వెంట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, తెరాస నాయకులు భరత్ కుమార్ రెడ్డి, మధుకర్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: